పెళ్లైన గంట‌ల్లోనే దూర‌మ‌య్యి..క‌రోనాపై పోరాటం చేస్తోన్న న‌వ దంప‌తులు

| Edited By: Pardhasaradhi Peri

Apr 04, 2020 | 3:45 PM

ఆమె అందమైన బ‌ట్ట‌లు కొనుక్కోని పెళ్లికి రెడీ అయిపోయింది. ఆ జంట హ‌నీమూన్ కి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు. మార్చి చివ‌ర్లో నిఖాకి ముహూర్తం ఫిక్స్ చేశారు పెద్ద‌లు. కానీ క‌రోనా మ‌హమ్మారి విరుచుకుప‌డ‌టంతో..ఆ జంట మ్యారేజ్ త‌ర్వ‌త ప్లాన్స్ అన్నీ ర‌ద్దు చేసుకున్నారు. దీంతో రెండు వారాల క్రితం, వారు న్యూజెర్సీలోని హౌథ్రోన్లోని ఒక మసీదు వద్ద ఇమామ్ను ఒప్పించి అతికొద్దిమంది స‌మ‌క్షంలో పెళ్లిని ముగించారు. అదే రోజు వధువు కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని […]

పెళ్లైన గంట‌ల్లోనే దూర‌మ‌య్యి..క‌రోనాపై పోరాటం చేస్తోన్న న‌వ దంప‌తులు
Follow us on

ఆమె అందమైన బ‌ట్ట‌లు కొనుక్కోని పెళ్లికి రెడీ అయిపోయింది. ఆ జంట హ‌నీమూన్ కి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు. మార్చి చివ‌ర్లో నిఖాకి ముహూర్తం ఫిక్స్ చేశారు పెద్ద‌లు. కానీ క‌రోనా మ‌హమ్మారి విరుచుకుప‌డ‌టంతో..ఆ జంట మ్యారేజ్ త‌ర్వ‌త ప్లాన్స్ అన్నీ ర‌ద్దు చేసుకున్నారు. దీంతో రెండు వారాల క్రితం, వారు న్యూజెర్సీలోని హౌథ్రోన్లోని ఒక మసీదు వద్ద ఇమామ్ను ఒప్పించి అతికొద్దిమంది స‌మ‌క్షంలో పెళ్లిని ముగించారు. అదే రోజు వధువు కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని న్యూ విండ్సర్‌లోని ఇంట్లో వేడుకలు జరుపుకున్నారు. వేడుక తరువాత, షెరీన్ తన భర్తకు 12 గంటల్లోనే ఎయిర్ పోర్ట్ లోనే సెండాఫ్ ఇవ్వాల్సి వ‌చ్చింది. అంతేకాదు వెంట‌నే ఆమె త‌న డ్యూటీలో కూడా జాయిన్ అయ్యింది. నివాసితుల బృందాలను పర్యవేక్షించే ఇంటర్నల్ మెడిసిన్ చీఫ్ రెసిడెంట్‌గా, ఆమె న్యూయార్క్‌లోని వివిధ ఆసుపత్రుల తిరుగుతూ క్ష‌ణం తీరిక లేకుండా ఆమె వైద్య సేవ‌లు అందిస్తోంది.

ఇక అయోవాలోని సెడార్ రాపిడ్స్‌లోని మెర్సీ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తున్న 37 ఏళ్ల చౌదరి కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. ప్ర‌స్తుతం అత‌డు డియోకాన్ఫరెన్సింగ్ ద్వారా క‌రోనా రోగులను పరీక్షిస్తున్నాడు. ఇలా పెళ్లైన‌ గంటల్లోనే దూర‌మ‌య్యి.. క‌రోనాపై యుద్దం చేస్తోన్న ఈ యువ దంప‌తుల‌ను ఇప్పుడు అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.