COVID19 కరోనాకు హోమియో చెక్

|

Apr 02, 2020 | 7:16 PM

కరోనా వైరస్ చెక్‌ పెట్టే ఆయుధం హోమియో అమ్ములపొదిలో ఉంది... వందల ఏళ్ళ క్రితం కూడా ఇలాంటి వైరస్‌లు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు కూడా హోమియోనే ఆదుకుంది... అవును ఇది నిజం అంటున్నారు హోమియో వైద్యులు.

COVID19 కరోనాకు హోమియో చెక్
Follow us on

Homeopathy to kill corona: కరోనా వైరస్ చెక్‌ పెట్టే ఆయుధం హోమియో అమ్ములపొదిలో ఉంది… వందల ఏళ్ళ క్రితం కూడా ఇలాంటి వైరస్‌లు ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పుడు కూడా హోమియోనే ఆదుకుంది… అవును ఇది నిజం అంటున్నారు హోమియో వైద్యులు.

మూడువందల ఏళ్ళ క్రితం ప్రస్తుత రష్యాదేశంలో సైబీరియాలో ఇన్‌ఫ్లూయంజా పేరుతో ఒకసారి, వందేళ్ళ క్రితం స్పెయిన్‌లో స్పానిష్‌ ఇన్‌ఫ్లూయంజా మరోసారి ప్రపంచాన్ని గడగడలాడించిన సందర్భంలో కూడా హోమియోపతిలో ఉన్న దివ్వౌషధం ” కాంఫోరా ”తో పూర్తిగా నయం చేశారని ఒంగోలుకు చెందిన హోమియోపతి ప్రాక్టీషనర్‌ చంద్రశేఖర్‌శర్మ ఘంటాపధంగా చెబుతున్నారు.

కంఫోరా తాను కనిపెట్టిన మెడిసిన్‌ కాదని హోమియోపతి పితామహుడు శామ్యూల్‌ హానిమాన్‌ వందల ఏళ్ళ క్రితం మానవాళికి అందించిన అధ్బుత సంజీవనిగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను కూడా ఇదే మెడిసిన్‌తో పూర్తిగా అరికట్టవచ్చంటున్నారు. 1918లో కరోనా వైరస్‌ సోకిన తరువాత వైద్యం అందించవచ్చని, అలాగే వైరస్‌ సోకకుండా ముందస్తు టీకాలాగా కూడా ఈ మెడిసిన్‌ పనిచేస్తుందని చెబుతున్న హోమియోపతి ప్రాక్టీషనర్‌ చంద్రశేఖరశర్మ ముందస్తు జాగ్రత్తగా హోమియోపతిని వినియోగించాలని సూచిస్తున్నారు.