కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?

|

Dec 10, 2020 | 4:08 PM

చిన్న మిస్టేక్ చాలు..భారీ మూల్యం చెల్లించుకోవడానికి. సమయానికి ఒక హోం గార్డు దేవుడిలా అక్కడికి వచ్చాడు గానీ లేకపోతే..ఘోరం జరిగిపోయి ఉండేది.

కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?
Follow us on

చిన్న మిస్టేక్ చాలు..భారీ మూల్యం చెల్లించుకోవడానికి. సమయానికి ఒక హోం గార్డు దేవుడిలా అక్కడికి వచ్చాడు గానీ లేకపోతే..ఘోరం జరిగిపోయి ఉండేది. వివరాల్లోకి వెళ్తే…ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన దంపతులు కారులో తమ ఇద్దరి పిల్లల్ని వదిలేసి దర్శనానికి వెళ్లారు. దీంతో చిన్నారులు సరిగ్గా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.

కరోనా‌ నిబంధనలు అమలవుతోన్న నేపథ్యంలో 10 సంవత్సరాల లోపు పిల్లలకు దర్శనానికి అనుమతి లేని విషయం తెలిసిందే. దీంతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన అనిల్‌కుమార్‌ దంపతులు తమ పిల్లలిద్దరినీ కారులోనే ఉంచి తాళం వేసి శ్రీవారిని దర్శించుకునేందు వెళ్లారు. కాసేపటికి చిన్నారులు శ్వాస తీసుకోలేక స్పృహ కోల్పోయి పడిపోయారు.  వారిని గమనించిన హోమ్‌గార్డు నరసింహయాదవ్‌ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి పిల్లల్ని బయటకు తీసి ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. సకాలంలో చికిత్స చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం కారు నంబరు తెలుపుతూ మైక్‌లో ప్రకటించడంతో క్యూలో ఉన్న తల్లిదండ్రులు వెంటనే అలర్టై రాగా పిల్లలను వారికి అప్పగించారు.

Also Read : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి, కారు అద్దాలు ధ్వంసం