హైదరాబాద్ మెట్రోకు ఎనిమిది అవార్డులు… పర్యావరణ పరిరక్షణ చర్యలకు గుర్తింపన్న ఎన్వీ‌ఎస్ రెడ్డి….

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2020 | 4:42 PM

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ‌ఎస్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ మెట్రోకు ఎనిమిది అవార్డులు... పర్యావరణ పరిరక్షణ చర్యలకు గుర్తింపన్న ఎన్వీ‌ఎస్ రెడ్డి....
Follow us on

HMRL wins eight prizes హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణాన్ని అందిస్తున్న మెట్రో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ‌ఎస్ రెడ్డి అన్నారు. 6వ తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్ 2020లో హైదరాబాద్ మెట్రోకు 8 అవార్డులు వచ్చాయని తెలిపారు. పర్యావరణంతో పాటు పచ్చదనానికి మెట్రో కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

 

నాలుగేళ్లుగా అవార్డులు వస్తున్నాయి…

గార్డెన్ ఫెస్టివల్‌కు ఎనిమిది విభాగాలకు ఎంట్రీలు పంపగా… ఎనిమిది విభాగాల్లోనూ మెట్రోకు అవార్డులు వచ్చాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెట్రో పరిసరాల్లో పచ్చదనం పెంపునకు దక్కిన గౌరవం అని అన్నారు. గార్డెన్ ఫెస్టివల్లో నాలుగు సంవత్సరాలుగా మెట్రో ఎన్నో అవార్డులు గెలుస్తూ వస్తోందని అన్నారు. మెట్రో పరిసరాల్లో మొక్కల పెంపకం, గార్డెన్ల ఏర్పాటుతో ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నామని అన్నారు. ఈ అవార్డులను మెట్రో సీనియర్ హార్టీకల్చర్ అధికారి సాయినాథ్ డిసెంబర్ 6న పబ్లిక్ గార్డెన్లో జరిగే కార్యక్రమంలో తీసుకుంటారని తెలిపారు.