స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు కేంద్రం భారీ షాక్..!

| Edited By: Pardhasaradhi Peri

Mar 14, 2020 | 6:36 PM

నిత్యావసర వస్తువుగా మారిపోయిన మొబైల్ ఫోన్ కొనడం ఇకపై సామాన్యులకు మరింత భారం కానుంది. శనివారం సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్..మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్‌టీని 18 శాతానికి పెంచాలని కౌన్సిల్ తీర్మానించింది.  దీంతో కొత్తగా ఫోన్ కొనాలంటే జేబులో డబ్బులు దండిగా ఉండాల్సిందే.  ఫుట్‌వేర్, ఫర్టిలైజర్స్, టెక్స్‌టైల్ ప్రొడక్ట్స్ వంటి వాటిపై కూడా జీఎస్‌టీ పెంపుకు ప్రతిపాదనలు వచ్చినా..కౌన్సిల్ వాటిని తోసిపుచ్చింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌ను పరిగణలోకి […]

స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు కేంద్రం భారీ షాక్..!
Follow us on

నిత్యావసర వస్తువుగా మారిపోయిన మొబైల్ ఫోన్ కొనడం ఇకపై సామాన్యులకు మరింత భారం కానుంది. శనివారం సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్..మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్‌టీని 18 శాతానికి పెంచాలని కౌన్సిల్ తీర్మానించింది.  దీంతో కొత్తగా ఫోన్ కొనాలంటే జేబులో డబ్బులు దండిగా ఉండాల్సిందే.  ఫుట్‌వేర్, ఫర్టిలైజర్స్, టెక్స్‌టైల్ ప్రొడక్ట్స్ వంటి వాటిపై కూడా జీఎస్‌టీ పెంపుకు ప్రతిపాదనలు వచ్చినా..కౌన్సిల్ వాటిని తోసిపుచ్చింది.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌ను పరిగణలోకి తీసుకొని మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీటిపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్  5 శాతంగా ఉంది. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త నందన నిలేకని కూడా జీఎస్‌టీ నెట్‌వర్క్‌లోని టెక్నికల్ పలు సమస్యలు, లోపాలకు కౌన్సిల్‌కు సవివరంగా ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2021 జనవరి నాటికి టెక్నికల్ సమస్యలు  పరిష్కరిస్తామని నందన్ నిలేకని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.