జమ్మూ కాశ్మీర్‌లో హై టెన్షన్

| Edited By: Srinu

Mar 07, 2019 | 7:17 PM

వరుస దాడులతో జమ్మూకాశ్మీర్‌లో హై టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది. మొన్న పుల్వామా, నిన్న పింగ్లాన్..ఇలా గ్యాప్ లేకుండా టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. పింగ్లాన్ సెక్టార్‌లో దాడిని భారత సైన్యం ధీటుగా ఎదుర్కుంది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ఇందులో పుల్వామా దాడి సూత్రదారులు హతమయ్యారు. అక్కడితో కథ ముగిసిపోలేదు. ఇప్పుడు మరో టెన్షన్ ఆర్మీని వెంటాడుతుంది. ఇంటిలిజెన్స్ రిపోర్టులు టెన్షన్ పెడుతున్నాయి. మరిన్ని ఆత్మాహుతి దాడులు జరగవొచ్చన్న ఐబీ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో 21 మంది ఉగ్రవాదులు […]

జమ్మూ కాశ్మీర్‌లో హై టెన్షన్
Follow us on

వరుస దాడులతో జమ్మూకాశ్మీర్‌లో హై టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది. మొన్న పుల్వామా, నిన్న పింగ్లాన్..ఇలా గ్యాప్ లేకుండా టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. పింగ్లాన్ సెక్టార్‌లో దాడిని భారత సైన్యం ధీటుగా ఎదుర్కుంది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ఇందులో పుల్వామా దాడి సూత్రదారులు హతమయ్యారు. అక్కడితో కథ ముగిసిపోలేదు. ఇప్పుడు మరో టెన్షన్ ఆర్మీని వెంటాడుతుంది. ఇంటిలిజెన్స్ రిపోర్టులు టెన్షన్ పెడుతున్నాయి. మరిన్ని ఆత్మాహుతి దాడులు జరగవొచ్చన్న ఐబీ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో 21 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారు. మూడు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేయడమే వీరి లక్ష్యమని ఇంటిలిజెన్స్ ఎప్పుడో తెలిపింది. అందులో ఒకటి పుల్వామా అని తేలిపోయింది. మిగతా రెండు దాడుల ఎక్కడ ఫ్లాన్ చేశారు? పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులంతా ఇప్పుడు ఎక్కడున్నారు? ఇవే ప్రశ్నలు సైన్యాన్ని ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి. ఎదురగా వచ్చే ఎటువంటి దాడులైనా భారత్ దీటుగా  ఎదర్కోడానికి సిద్ధంగా ఉంది. మరి పుల్వామా లాంటి దొంగ దెబ్బలకు ఎటువంటి విరుగుడు చర్యలు తీసుకోవాలా అని ఆలోచనలు సాగిస్తుంది.