GHMC Election Results 2020 :హైదరాబాద్ లో హై టెన్షన్.. నగరంలో పోలీస్ ఆంక్షలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

| Edited By: Ram Naramaneni

Dec 04, 2020 | 6:27 AM

హైదరాబాద్ లో హై టెన్షన్ మొదలైంది. బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్లు ఏ పార్టీ కి వైపు మొగ్గు చూపారో తెలియాలంటే కొన్ని గంటలు మాత్రం...

GHMC Election Results 2020 :హైదరాబాద్ లో హై టెన్షన్.. నగరంలో పోలీస్ ఆంక్షలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
Follow us on

హైదరాబాద్ లో హై టెన్షన్ మొదలైంది. బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్లు ఏ పార్టీ కి వైపు మొగ్గు చూపారో తెలియాలంటే కొన్ని గంటలు మాత్రం అగాల్సివుంది. కాగా, కౌంటింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఒక కిలోమీటర్ పరిధి వరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఉంటుంది. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఉదయం ఆరు గంటల నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. ఇవి సాయంత్రం ఆరుగంటల వరకు ఉంటాయి. రోడ్లపై జనం గుమి గూడవద్దు. ఊరేగింపులు, సమావేశాలపై నిషేధం ఉంటుంది. టెంట్లు, స్టేజీలు, మైకులు, లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేయవద్దు. ప్ల కార్డుల ప్రదర్శన, మత విద్వేషాలు రెచ్చగొట్టడం చేయవద్దు. రోడ్లు, కూడళ్లలో స్పీచులు, ప్రదర్శనలు కుదరదు.గెలిచిన అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి హంగామా చేయకూడదు. తమ డివిజన్‌లోనూ సంబరాలు చేసుకునే అవకాశం లేదు. రెండు రోజుల తర్వాత మాత్రమే.. అది కూడా పోలీసుల పర్మిషన్‌తోనే సెలబ్రేషన్స్‌ చేసుకోవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.