‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదలకు బ్రేక్.. వర్మకి హైకోర్టు షాక్..!

| Edited By:

Nov 30, 2019 | 5:10 PM

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కాదు.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. వరుస వివాదాల నడుమ తన సినిమా పేరు మార్చుకున్నారు డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మ. రేపు సినిమా విడుదలకు ప్లాన్‌ చేశారు. వివాదాల నడుమ ఇరుక్కున్న వర్మ సినిమా విడుదలవుతుందా? ఆగుతుందా? ఇటు పొలిటికల్‌ గా.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. వివాదాలు సృష్టించడంలో.. వర్మ ట్రెండే సపరేటు..! అతనికి వివాదాలు కొత్తేమీ కాదు. నిత్యం వాటితోనే స్నేహం చేస్తూ ఉంటాడు. […]

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలకు బ్రేక్.. వర్మకి హైకోర్టు షాక్..!
Follow us on

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కాదు.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. వరుస వివాదాల నడుమ తన సినిమా పేరు మార్చుకున్నారు డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మ. రేపు సినిమా విడుదలకు ప్లాన్‌ చేశారు. వివాదాల నడుమ ఇరుక్కున్న వర్మ సినిమా విడుదలవుతుందా? ఆగుతుందా? ఇటు పొలిటికల్‌ గా.. అటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.

వివాదాలు సృష్టించడంలో.. వర్మ ట్రెండే సపరేటు..! అతనికి వివాదాలు కొత్తేమీ కాదు. నిత్యం వాటితోనే స్నేహం చేస్తూ ఉంటాడు. ఎదుటివారికి తనదైన స్టైల్లో షాక్‌ ఇవ్వడం వర్మకి షరా మామూలే. ఏపీలో జరిగిన ప్రస్తుత రాజకీయాలపై వర్మ ‘కమ్మ రాజ్యంలో.. కడప రెడ్లు’ చిత్రం తీశాడు. ఈ సినిమాతో పలు వివాదాలకు ఆజ్యం పోస్తున్న వర్మకి.. హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ నెల 29వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు వర్మ.. ఇప్పటికే ప్రకటించాడు. కానీ.. అసలు ఇంతవరకూ ఈ సినిమాకి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు సెన్సార్ బోర్డు. అయితే.. వర్మ ఏమో.. సినిమా రేపే విడుదల చేస్తా అంటున్నాడు. ఈ కన్ఫూజన్స్‌తో.. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి.

అయితే.. ఈ వివాదంపై స్పందించిన హైకోర్టు వారం రోజుల్లోగా సినిమాను పరిశీలించి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఆదేశం ఇచ్చింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి.. అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌కి హైకోర్టు సూచించింది. అంతేకాకుండా.. ఈ సినిమా టైటిల్ కూడా మార్చాలని చెప్పింది. అయితే.. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’గా మార్చినట్టు.. హైకోర్టుకు తెలిపారు వర్మ తరపు లాయర్. కాగా.. త్వరగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు వర్మ. చూడాలి మరి.. సినిమా రేపే విడుదల అవుతుందా..? లేదా..? అన్నది.

వర్మ సినిమాపై గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ.పాల్‌. తనను అవమానించేలా సినిమాలో సన్నివేశాలున్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.