ఉత్తర ద్వార దర్శనంపై టిటిడి వివరణ కోరిన హైకోర్ట్!

| Edited By: Srinu

Jan 03, 2020 | 4:54 PM

‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు ‘ఉత్తర ద్వార దర్శనం’ అందించడంపై తన వైఖరిని వివరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం ఆదేశించింది. దీనిపై కోర్టు ఆదేశాలు కోరుతూ న్యాయవాది తాళ్ళపాక రాఘవన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని ఉత్తర ద్వార దర్శనం చారిత్రక ప్రాముఖ్యత గురించి వివరించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి, జస్టిస్ ఎం […]

ఉత్తర ద్వార దర్శనంపై టిటిడి వివరణ కోరిన హైకోర్ట్!
Follow us on

‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు ‘ఉత్తర ద్వార దర్శనం’ అందించడంపై తన వైఖరిని వివరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం ఆదేశించింది. దీనిపై కోర్టు ఆదేశాలు కోరుతూ న్యాయవాది తాళ్ళపాక రాఘవన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని ఉత్తర ద్వార దర్శనం చారిత్రక ప్రాముఖ్యత గురించి వివరించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి, జస్టిస్ ఎం వెంకటరమణలతో కూడిన హైకోర్టు ధర్మాసనం పిటిషనర్‌ను కోరింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

పిటిషనర్ తన వాదనలో దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. ఉత్తర ద్వార దర్శనాన్ని  10 రోజులు అనుసరిస్తున్నారని తెలిపారు. అయితే, తిరుమల ఆలయంలో ఇది రెండు రోజులకు మాత్రమే పరిమితం. ఉత్తర ద్వార దర్శనం 10 రోజుల పాటు అనుమతించాలని ఆగమ సలహా మండలి టిటిడికి సూచించిందని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా.. ఇలాంటి సూచనలు తమకు అందలేదని టిటిడి తరపు సీనియర్ న్యాయవాది వైవి రవి ప్రసాద్ తెలిపారు. తిరుమలలో 10 రోజుల పాటు ‘ఉత్తర ద్వార దర్శనం’ అనుసరించాలని ఆగమ సలహా మండలి సూచించినట్లయితే, వచ్చే ఏడాది నుంచి ఇది అమలు అవుతుందని ప్రసాద్ తెలిపారు.