ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్..రూ. 1400 కోట్లు చెల్లించాలని ఆదేశం

|

Dec 20, 2019 | 7:27 PM

హైకోర్టులో సీఎం జగన్ సర్కార్‌కు షాక్ తగిలింది. రూలింగ్‌లోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ టెండరింగ్,  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి  పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్‌కు అన్ని ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అయితే పీపీఏ రద్దు విషయంలో ఆయనకు కష్టాలు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను రద్దు చేసుకోవాలని జగన్ సర్కార్ భావించింది. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అక్షింతలు పడటంతో పాటు హైకోర్టులో కూడా చుక్కెదురైంది. దీంతో […]

ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్..రూ. 1400 కోట్లు చెల్లించాలని ఆదేశం
Follow us on

హైకోర్టులో సీఎం జగన్ సర్కార్‌కు షాక్ తగిలింది. రూలింగ్‌లోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ టెండరింగ్,  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి  పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్‌కు అన్ని ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అయితే పీపీఏ రద్దు విషయంలో ఆయనకు కష్టాలు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను రద్దు చేసుకోవాలని జగన్ సర్కార్ భావించింది. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అక్షింతలు పడటంతో పాటు హైకోర్టులో కూడా చుక్కెదురైంది. దీంతో వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం..ఆయా సంస్థల నుంచి విద్యుత్ కొనకుండా అలా హోల్డ్‌లో పెట్టింది.  దీంతో తమతో ఒప్పందాలు అయినా కూడా  గవర్నమెంట్..  తమ నుంచి సోలార్, విండ్ పవర్ కొనుగోలు చేయడం లేదంటూ కొన్ని కంపెనీలు మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కాయి. అగ్రిమెంట్‌లో క్లియర్ కట్‌గా ఉన్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల తాము నష్టపోతున్నామని కంపెనీలు కోర్టుకు మొరపెట్టుకున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిన హైకోర్టు ఆయా కంపెనీలకు రూ.1400 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.