వారందరికీ రూ. 1500… కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

|

May 13, 2020 | 7:27 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని తక్షణం ఆదుకోవాలని, ముఖ్యంగా పేదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

వారందరికీ రూ. 1500... కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
Follow us on

Telangana high court orders to KCR government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని తక్షణం ఆదుకోవాలని, ముఖ్యంగా పేదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని హైకోర్టు ధర్మాసనం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

రేషన్ సరుకులతో సంబంధం లేకుండా తెల్లకార్డున్న వారందరికీ రూ.1500 ఇవ్వాలని హైదరాబాద్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కొందరు తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.1500 నిలిపివేయడంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోలేదన్న కారణంగా రూ.1500 ఇవ్వలేదని దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

రూ.1500లు నిలిపివేసే ముందు లాక్ డౌన్ పరిస్థితిలో పేదల స్థితిగతులను ఆలోచించాల్సిందంటూ కాస్త ఘాటైన వ్యాఖ్యలను న్యాయమూర్తులు పాస్ చేశారు. కనీసం నోటీసు ఇవ్వకుండా 8 లక్షల కార్డులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయలేదని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే.. ఏజీ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. 8 లక్షల మందికి ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపివేశారో పూర్తి వివరాలు కోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశించింది. అయితే పూర్తి నివేదిక సమర్ఫణకు కాస్త సమయం కావాలని ఏపీ ధర్మాసనాన్ని కోరడంతో తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.