Housing Society Elections: జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. కొత్త ఓటర్ల గురించి ఏం చెప్పిందంటే..

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 6:38 PM

Housing Society Elections: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ రెండు నెలల్లోగా

Housing Society Elections: జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. కొత్త ఓటర్ల గురించి ఏం చెప్పిందంటే..
Follow us on

Housing Society Elections: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ రెండు నెలల్లోగా పూర్తి చేయాలని తీర్పునిచ్చింది. అర్హులైన ఓటర్లతో కొత్త జాబితాను తయారు చేసి ప్రచురించాలని పేర్కొంది. ప్రచురించిన తేదీ నుంచి కనీసం రెండు వారాలు గడువును విధించి అభ్యంతరాలు, క్లెయిములు స్వీకరించాలని హైకోర్టు సూచించింది.

పర్సనల్ ఇన్‌ఛార్జి కమిటీ తుది పరిశీలన అనంతరం ఫైనల్‌ ఓటరు జాబితాను ప్రకటించాలని పేర్కొంది. ఈ లిస్టును తెలంగాణ రిజిస్ట్రార్ కం కోఆపరేటివ్ సొసైటీకి పంపాలని ఆదేశించింది. తదనంతరం జాబితాలో మార్పుచేర్పులను రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ ధృవీకరించాలని హైకోర్టు సూచించింది. రిజిస్ట్రార్ ఆమోదించిన ఓటర్ లిస్టును పర్సనల్ ఇంఛార్జి కమిటీ స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీకి అందించాలని తెలిపింది. నేటి నుంచి రెండు నెలల్లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని చదవండి:

మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..

Haridwar Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. మకరసంక్రాంతి రోజు నుంచి కుంభమేళా ప్రారంభం..