ఆ కాంట్రాక్టర్‌ను ఎలా కొనసాగిస్తున్నారు…

|

Aug 19, 2020 | 4:32 PM

హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో భోజ‌నం స‌ర‌ఫ‌రా చేసే కాంట్రాక్ట‌ర్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిలోఫర్‌ భోజనం సరఫరా కాంట్రాక్టరు అక్రమాలపై విచార‌ణ జ‌ర‌పాలంటూ దాఖ‌లైన పిల్ పై న్యాయ‌స్థానం విచారించింది.

ఆ కాంట్రాక్టర్‌ను ఎలా కొనసాగిస్తున్నారు...
Follow us on

హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో భోజ‌నం స‌ర‌ఫ‌రా చేసే కాంట్రాక్ట‌ర్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిలోఫర్‌ భోజనం సరఫరా కాంట్రాక్టరు అక్రమాలపై విచార‌ణ జ‌ర‌పాలంటూ దాఖ‌లైన పిల్ పై న్యాయ‌స్థానం విచారించింది. అక్ర‌మాల‌పై సీఐడీ విచార‌ణ జ‌ర‌పాల‌ని పిటిష‌న‌ర్ కోరగా… కాంట్రాక్ట‌ర్ అక్ర‌మాలు నిజ‌మేనంటూ సూప‌రిండెంట్ నివేదిక స‌మ‌ర్పించారు. త‌ప్పుడు బిల్లుల‌తో కాంట్రాక్ట‌ర్ నిధులు దుర్వినియోగం చేశాడ‌ని నివేదిక‌లో పొందుప‌ర్చారు. దీంతో నివేదిక ఆధారంగా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. నివేదిక ఆధారంగా కాంట్రాక్టరుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టరును గాంధీ, ఛాతీ ఆసుపత్రిలోనూ ఎలా కొనసాగిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కాంట్రాక్టరుపై రెండు వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలంటి చర్యలు తీసుకున్నారో సెప్టెంబరు 16లోగా నివేదిక సమర్పించాలని ఆదేసించింది.