పుల్వామా రిపీట్ అయ్యే అవకాశం.. పాక్ ఇంటలిజెన్స్

| Edited By:

Jun 17, 2019 | 10:11 AM

మరో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అవంతీపొరలో ఉగ్రవాద దాడికి అవకాశం ఉందని పాకిస్థాన్‌ నిఘా వర్గాలు భారత్‌‌కు సమాచారాన్ని అందించాయి. దీంతో జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది. గత నెలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జాకీర్ మూసా హతమైన నేపథ్యంలో.. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని.. పాక్ నిఘా వర్గాలు భారత్‌కు తెలిపాయి. అయితే దాడికి సంబంధించి […]

పుల్వామా రిపీట్ అయ్యే అవకాశం.. పాక్ ఇంటలిజెన్స్
Follow us on

మరో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అవంతీపొరలో ఉగ్రవాద దాడికి అవకాశం ఉందని పాకిస్థాన్‌ నిఘా వర్గాలు భారత్‌‌కు సమాచారాన్ని అందించాయి. దీంతో జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వెంట గస్తీని మరింత పెంచింది. గత నెలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జాకీర్ మూసా హతమైన నేపథ్యంలో.. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని.. పాక్ నిఘా వర్గాలు భారత్‌కు తెలిపాయి. అయితే దాడికి సంబంధించి పక్కా సమాచారాన్ని పాక్‌ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాద దాడి అనంతరం భారత్‌ నుంచి విమర్శలు, ప్రపంచ దేశాల నుంచి వచ్చే ఒత్తిడిని తప్పించుకోవడానికి ఇలా సమాచారాన్ని ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.