ప్రియుడిని పరిచయం చేసిన ‘చిన్నారి పెళ్లికూతురు’

|

Nov 11, 2020 | 9:41 PM

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్ తన ప్రియుడ్ని పరిచయం చేసింది. మిలింద్ చద్వానీతో తాను ప్రేమలో ఉన్నట్లు

ప్రియుడిని పరిచయం చేసిన చిన్నారి పెళ్లికూతురు
Follow us on

Heroine Avika Gor: ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్ తన ప్రియుడ్ని పరిచయం చేసింది. మిలింద్ చద్వానీతో తాను ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన అవికా గోర్.. ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

”నా ప్రార్ధనలకు సమాధానం లభించింది. నా లైఫ్‌లో లవ్ దొరికింది. మనల్ని అర్ధం చేసుకుని.. మనకి స్ఫూర్తినిచ్చి.. మనం ఎదగడంలో సాయం చేసి.. మనల్ని జాగ్రత్తగా చూసుకునే భాగస్వామి కావాలని మనం కోరుకుంటాం. కానీ చాలామంది దీన్ని అసాధ్యం అనుకుంటారు. కలగా భావిస్తారు. అయితే జరుగుతున్నది అంతా నిజం. మీకోసం నేను ప్రార్ధిస్తాను. నేను ఇప్పుదేడైతే ఫీల్ అవుతున్నానో.. అదే భావన మీరు కూడా ఒక రోజున పొందాలని ఆశిస్తాను. నాకు ఈ అనుభూతిని ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు. ఈ బంధం నా జీవితంలో చాలా కీలకమైంది” అని పేర్కొంటూ అవికా గోర్ తన లవ్ లైఫ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది.

కాగా, అవికా గోర్ తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఇటీవల సైజ్ జీరోగా మారి అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసింది.