ట్వీట్‌తో కొత్త సినిమాపై క్లూ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ!

| Edited By:

May 12, 2020 | 4:02 PM

ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ.. మంచి ఇమేజ్‌తో టాలీవుడ్‌లో ముందుకు దూసుకెళ్తున్నాడు విజయ్ దేవర కొండ. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ.. జోరు మీదున్న విజయ్ దేవరకొండ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్..

ట్వీట్‌తో కొత్త సినిమాపై క్లూ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ!
Follow us on

ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ.. మంచి ఇమేజ్‌తో టాలీవుడ్‌లో ముందుకు దూసుకెళ్తున్నాడు విజయ్ దేవర కొండ. ఇప్పటికే వరుసపెట్టి సినిమాలు చేస్తూ.. జోరు మీదున్న విజయ్ దేవరకొండ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విలక్షణ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఓ క్లూ కూడా ఇచ్చేశాడు అర్జున్ రెడ్డి.

‘ఫైటర్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా నిరూపించుకునేందుకు సెట్స్‌పై ముస్తాబవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 40 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తయ్యింది. అయితే మొత్తం సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. కాగా ఇప్పటికే ఈ సినిమాతో పాటు మరో కొన్ని ప్రాజెక్టులకు కూడా రౌడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫైటర్ సినిమా తర్వాత, శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

కాగా తాజాగా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఓ డైరెక్టర్ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘విజయ్‌కి బర్త్ డే విషెస్ చేస్తూ.. ఈ ఏడాది నీ నుంచి ఇంకా మంచి సినిమాలు రావాల్సి ఉంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. దీనికి అర్జున్ రెడ్డి బదులిస్తూ.. ‘థాంక్యూ.. నాకు తెలుసు.. ఆ అద్భుతం మనిద్దరం కలిసి చెయ్యబోతున్నాం’ అని రీట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీటిపై ఏ విషయమన్నది లాక్‌డౌన్ తర్వాత తేలనుంది.