భయంకరంగా ‘నాంది’ టీజర్.. న్యాయానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు?

| Edited By:

Jun 30, 2020 | 12:46 PM

అల్లరి నరేష్ మళ్లీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన 'నాంది' చిత్రంతో రాబోతున్నాడు. ఈ రోజు నరేష్ పుట్టినరోజు సందర్భంగా 'నాంది' సినిమా నుంచి ఓ చిన్నపాటి టీజర్ రిలీజ్ అయింది. దీన్ని యంగ్ హీరో విజయ్ దేవరకొండ..

భయంకరంగా నాంది టీజర్.. న్యాయానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు?
Follow us on

అల్లరి నరేష్ మళ్లీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ‘నాంది’ చిత్రంతో రాబోతున్నాడు. ఈ రోజు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘నాంది’ సినిమా నుంచి ఓ చిన్నపాటి టీజర్ రిలీజ్ అయింది. దీన్ని యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు.

ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న అల్లరి నరేష్ చడీ చప్పుడు కాకుండా ఓ సినిమా పూర్తి చేసుకున్నాడు. తన 57వ చిత్రంగా ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో తనంటే నిరూపించుకున్న అల్లరి నరేష్.. మరోసారి ఓ ఇంట్రస్టింగ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. నరేష్ హీరోగా.. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూన్ 30న నరేశ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ అంటే చిన్నపాటి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇక నాంది టీజర్ విషయానికొస్తే.. సినిమా టీజర్ చూస్తుంటే.. చాలా భయంకరంగా ఉంది. అల్లరి నరేష్ పాత్ర ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. ఓ డిఫరెంట్ జానర్‌లో నరేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజర్‌ని బట్టి చూస్తుంటే.. ఈ స్టోరీ మొత్తం జైల్లోనే కొనసాగుతందని అర్థమవుతంది. ఇక ఏం నేరం చేశారో తెలీదు కానీ ఖైదీలు ఏళ్లతరబడి జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారనే కొత్త పాయింట్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక టీజర్‌‌కి డైరెక్టర్ హరీష్ శంకర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉంది. మొత్తానికి మరో కొత్త కథతో వస్తున్నాడు అల్లరి నరేష్. కాగా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలని ఇప్పటికే రిలీజ్ చేసింది చిత్ర బృందం.