యూట్యూబ్ హిస్టరీని.. ఆటో డిలీట్ చేయండిలా..?

|

Oct 05, 2019 | 7:06 PM

సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ యూజర్ల కోసం సరికొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డిలీట్ ఆప్షన్ ద్వారా దానికదే డిలీట్ అవుతుంది.గూగుల్ సెర్చ్ యూజర్ల కోసం ప్రత్యేకించి గూగుల్ Auto-Delete Toolను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ప్లాట్ ఫాంపై సెర్చ్ చేసే యూజర్ లొకేషన్ ట్రాకింగ్,వెబ్, యాప్ యాక్టివిటీ హిస్టరీని మ్యానువల్ గా […]

యూట్యూబ్ హిస్టరీని.. ఆటో డిలీట్ చేయండిలా..?
Follow us on

సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ యూజర్ల కోసం సరికొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డిలీట్ ఆప్షన్ ద్వారా దానికదే డిలీట్ అవుతుంది.గూగుల్ సెర్చ్ యూజర్ల కోసం ప్రత్యేకించి గూగుల్ Auto-Delete Toolను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ప్లాట్ ఫాంపై సెర్చ్ చేసే యూజర్ లొకేషన్ ట్రాకింగ్,వెబ్, యాప్ యాక్టివిటీ హిస్టరీని మ్యానువల్ గా డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే.. ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది. ఇక ఈ ఫీచర్‌ను ఇప్పుడు గూగుల్ యూట్యూబ్ కి కూడా తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హిస్టరీ అంతా ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది. ఒకవేళ అలా హిస్టరీ డిలీట్ కాకపోతే గూగుల్ మరో మూడు ఆప్సన్లను అందుబాటులో పెట్టింది. వాటి ద్వారా డిలీట్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఇదే ఆప్షన్ మీకు స్మార్ట్ ఫోన్‌లో ఎక్కడుందో తెలియాలంటే.. మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. గూగుల్ కెళ్లండి. ఆ బటన్ ను ట్యాప్ చేస్తే.. అక్కడ మీకు డేటా పర్సనల్ కనిపిస్తుంది. అందులో యూట్యూబ్ హిస్టరీని ట్యాప్ చేయండి. తరువాత మేనేజ్ యాక్టివిటినీ ప్రెస్ చేయండి. ఆ తరువాత గూగుల్ పేజీని రీ డైరక్ట్ చేయండి. గూగుల్ మైయాక్టివిటీ పేజీలోకి వెళ్లండి. అక్కడ మీ యూట్యూబ్ హిస్టరీ ఆన్ లో ఉంటే వెంటనే అక్కడ కనిపించే Choose to delete automatically అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి. ఇక ఇందులోనే మూడు ఒప్షన్స్ కనిపిస్తాయి. అవే Keep until I delete manually,Keep for 18 months’ and ‘Keep for 3 months’. ఇందులో మీకు నచ్చిన ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి చాలు.

ఇక వెబ్‌లో అయితే గూగుల్ లో కనిపించే మైయాక్టివిటీని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఈ లింక్ క్లిక్ చేయండి చాలు..https://myactivity.google.com/activitycontrols/youtube దీని తర్వాత Keeping activity until you delete it manually అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి. అందులో ‘Choose to delete automatically అనే ఆప్సన్ ఎంచుకోండి. ఇక ఆ తర్వాత కనిపించే ప్రిఫెరెన్స్ నొక్కితే చాలు.. మొత్తం డిలీట్ అయిపోతుంది.