కరోనాకు, సీజనల్ ఫ్లూకు మధ్య తేడాలివే..!

|

Jul 25, 2020 | 5:37 PM

అసలే కరోనా కాలం.. ఆపై దంచికొడుతున్న వర్షాలు.. ఇలాంటి సమయంలో చిన్నగా దగ్గినా.. తుమ్మినా కూడా కరోనా సోకిందేమోనన్న అనుమానాలు, ఆందోళనలు కలగకమానవు.

కరోనాకు, సీజనల్ ఫ్లూకు మధ్య తేడాలివే..!
Follow us on

Difference Between Seasonal Flu And CoronaVirus: అసలే కరోనా కాలం.. ఆపై దంచికొడుతున్న వర్షాలు.. ఇలాంటి సమయంలో చిన్నగా దగ్గినా.. తుమ్మినా కూడా కరోనా సోకిందేమోనన్న అనుమానాలు, ఆందోళనలు కలగకమానవు. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫ్లూ వల్ల ఎక్కువమందిలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలే కనిపిస్తాయి. దీనితో కరోనా వచ్చిందేమో అని అనుమానం కలుగుతుంది.

అయితే చిన్నపాటి జ్వరానికి, దగ్గుకు కరోనా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదని… మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఆ వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే మనకి సోకింది కరోనానో కాదో ఈజీగా తెలుసుకోవచ్చునని వారు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

కరోనా లక్షణాలు: జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు, అలసట.. ఇక తలనొప్పి, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయి.

సీజనల్ ఫ్లూ లక్షణాలు: జ్వరం, పొడి దగ్గు, ఒళ్లు నొప్పులు, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జలుబు, ముక్కుదిబ్బడ.. ఇక వాంతులు, విరేచనాలు స్వల్పంగా ఉంటాయి.

జలుబు లక్షణాలు: ముక్కు దిబ్బడ, తుమ్ములు, గొంతు నొప్పి.. లో ఫీవర్, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..