వైష్ణ‌వోదేవి దర్శనం కోసం ప్రారంభమైన హెలికాప్ట‌ర్ సేవలు

|

Oct 16, 2020 | 11:17 AM

జ‌మ్మూలోని మాతా వైష్ణ‌వోదేవి ఆల‌యం తెరుచుకుంది. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి ఆ ఆల‌యానికి వెళ్లే భ‌క్తులు ఈ సేవలను...

వైష్ణ‌వోదేవి దర్శనం కోసం ప్రారంభమైన హెలికాప్ట‌ర్ సేవలు
Follow us on

Vaishno Devi Yatra : జ‌మ్మూలోని మాతా వైష్ణ‌వోదేవి ఆల‌యం తెరుచుకుంది. దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి ఆ ఆల‌యానికి వెళ్లే భ‌క్తులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఆలయ అధికారులు ప్రకటించారు.

వైష్ణవోదేవి ఆల‌యానికి చేరుకోవడానికి నడకదారి మార్గంతోపాటు హెలికాప్ట‌ర్ స‌ర్వీసులు ప్రారంభమయ్యాయని ఆల‌య బోర్డు చైర్మ‌న్ సీఈవో తెలిపారు. గుర్రాలు, బిట్టు, పల్లకి సేవ‌లు కూడా మొద‌లైన‌ట్లు ఆల‌య అధికారి వెల్ల‌డించారు.

అయితే జ‌మ్మూక‌శ్మీర్ బ‌య‌టి రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారు మాత్రం క‌చ్చితంగా క‌రోనా నెగ‌టివ్ సర్టిఫికెట్  తీసుకురావాల్సి ఉంటుంద‌ని ఆల‌య బోర్డు సీఈవో పేర్కొన్నారు. ఆల‌యంలోనూ కోవిడ్ టెస్టింగ్ స‌దుపాయాల‌ను క‌ల్పించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.