పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి భారీగా నీరు లీక్..తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న సిబ్బంది..

|

Dec 30, 2020 | 11:11 AM

పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి భారీగా నీరు లీక్‌ అవుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా పనిచేస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 4 గేట్ల నుంచి నీరు వృథాగా వెళ్తోంది. దీంతో...

పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి భారీగా నీరు లీక్..తాత్కాలిక మరమ్మతులు చేస్తున్న సిబ్బంది..
Follow us on

Heavy Water Leak : పోతిరెడ్డిపాడు గేట్ల నుంచి భారీగా నీరు లీక్‌ అవుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా పనిచేస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 4 గేట్ల నుంచి నీరు వృథాగా వెళ్తోంది. దీంతో సిబ్బంది అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టారు.

అయినా నీటి ప్రవాహం చూస్తే.. ఇప్పట్లో కంట్రోల్ అయ్యేలా కనిపించడం లేదు. రెండు సంవత్సరాల నుంచి మరమ్మతులు చేపట్టకపోవడంతో గేట్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీరు లీక్ అవుతోంది. వారం క్రితం పోతిరెడ్డిపాడు గేట్లు మూసినా నీరు లీకవుతుండడంతో సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఇదే తరహాలో గేట్ల నుంచి నీరు లీకైతే ప్రాజెక్ట్‌ ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉందన్న అంచనాలు అందుతున్నాయి.