భాగ్యనగరాన్ని మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేసిన భారీ వర్షాలు

|

Oct 18, 2020 | 8:33 AM

రెండు రోజుల విరామంతో ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏకధాటిగా కురిసిన భారీవర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ నీళ్లు చేరాయి. నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు చెరువులను తలపించాయి. జాతీయ రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నదీంకాలనీ, బాలాపూర్‌, మలక్‌పేట, చార్మినార్‌, మూసారంబాగ్‌, ఉప్పల్‌, పీర్జాదిగూడ, […]

భాగ్యనగరాన్ని మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేసిన భారీ వర్షాలు
Follow us on

రెండు రోజుల విరామంతో ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏకధాటిగా కురిసిన భారీవర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ నీళ్లు చేరాయి. నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు చెరువులను తలపించాయి. జాతీయ రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నదీంకాలనీ, బాలాపూర్‌, మలక్‌పేట, చార్మినార్‌, మూసారంబాగ్‌, ఉప్పల్‌, పీర్జాదిగూడ, ఎల్బీనగర్‌, నాగోల్‌ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. షేక్‌పేట, అంబేద్కర్‌నగర్‌ నాలా ప్రాంతాలు, బేగంపేట, చైతన్యపురిలోని కమలానగర్‌, బాటసింగారం, వనస్థలిపురం, హయత్‌నగర్‌, మణికొండ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్దఅంబర్‌పేట్‌, గుడిమల్కాపూర్‌, లంగర్‌హౌజ్‌, హబ్సిగూడ, రామంతాపూర్‌, సికింద్రాబాద్‌, తదితర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరింది.