బంగాళాఖాతాంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు..

| Edited By:

Jul 06, 2020 | 8:54 AM

ఈసారి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే పలకరించాయి. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. కాగా.. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం

బంగాళాఖాతాంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు..
Follow us on

Heavy rainfall in two days: ఈసారి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే పలకరించాయి. అడపా దడపా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. కాగా.. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో సోమ,మంగళవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్ జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నారు. రాగల రెండ్రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.