ఉత్తరభారతాన్ని ముంచెత్తుతున్న వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు

| Edited By: Srinu

Jul 11, 2019 | 1:01 PM

నైరుతి రుతుపవనాల కారణంగా ఉత్తరభారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. అరుణాచలప్రదేశ్, హిమాచలప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, ఘార్ఖండ్ సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అరుణాచల్‌లోని ఓ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్మావూన్ ప్రాంతంలో జోరుగా వానలు పడుతున్నాయి. ఇటు ఉత్తరాఖండ్‌ను కూడా వరుణుడు వదలడం లేదు. నదుల ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. మరో నాలుగు […]

ఉత్తరభారతాన్ని ముంచెత్తుతున్న వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు
Follow us on

నైరుతి రుతుపవనాల కారణంగా ఉత్తరభారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. అరుణాచలప్రదేశ్, హిమాచలప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, ఘార్ఖండ్ సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అరుణాచల్‌లోని ఓ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్మావూన్ ప్రాంతంలో జోరుగా వానలు పడుతున్నాయి. ఇటు ఉత్తరాఖండ్‌ను కూడా వరుణుడు వదలడం లేదు. నదుల ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. మరో నాలుగు రోజులు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. భారీగా కురుస్తున్న వర్షాలతో గంగా, బ్రహ్మపుత్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిషీకేష్ దగ్గర గంగానదీ ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. నదీ తీరంలో నివశించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరోవైపు గౌహతిలో కూడా కొండచరియలు విరిగిపడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.