నిండుకుండలా నాగార్జునసాగర్

|

Sep 28, 2020 | 10:31 AM

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. జల ప్రవాహం చూపరులను కనువిందుచేస్తోంది. ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో 20 క్రస్టుగేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ లో ఇన్ ఫ్లో :4,19,332 క్యూసెక్కులుగా ఉండగా, అదేస్థాయిలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 310.1486 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.60 అడుగుల […]

నిండుకుండలా నాగార్జునసాగర్
Follow us on

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. జల ప్రవాహం చూపరులను కనువిందుచేస్తోంది. ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో 20 క్రస్టుగేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ లో ఇన్ ఫ్లో :4,19,332 క్యూసెక్కులుగా ఉండగా, అదేస్థాయిలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 310.1486 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం: 589.60 అడుగుల మేర ఉంది. సాగర్ గేట్ల నుంచి ఎగసిపడుతున్న జలసిరిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఏపీలోని గుంటూరు, తెలంగాణలోని నల్గొండ జిల్లాల మధ్య సరిహద్దులో కృష్ణా నదిపై ఉన్న ఈ ప్రాజెక్టును 1955 – 1967 మధ్య నిర్మించారు.