బీహార్‌లో మరణ మృదంగం.. మెదడువాపుతో 80 మందికి పైగా మృతి

| Edited By:

Jun 16, 2019 | 2:26 PM

బీహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ముజఫ్ఫర్‌పూర్ జిల్లాలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కాగా, మరణించిన వారంతా పదేళ్లలోపు వయస్సుగల వారేనని అధికారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ వైద్య కళాశాల ఆసుపత్రి, కేజ్రీవాల్ ఆసుపత్రిలో ఈ చిన్నారులు వైద్య చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. శ్రీకృష్ణ వైద్య ఆసుపత్రిలో 197 మంది, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న […]

బీహార్‌లో మరణ మృదంగం.. మెదడువాపుతో 80 మందికి పైగా మృతి
Follow us on

బీహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ముజఫ్ఫర్‌పూర్ జిల్లాలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కాగా, మరణించిన వారంతా పదేళ్లలోపు వయస్సుగల వారేనని అధికారులు చెబుతున్నారు.

శ్రీకృష్ణ వైద్య కళాశాల ఆసుపత్రి, కేజ్రీవాల్ ఆసుపత్రిలో ఈ చిన్నారులు వైద్య చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. శ్రీకృష్ణ వైద్య ఆసుపత్రిలో 197 మంది, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కేజ్రీవాల్ ఆసుపత్రిలో 91 మంది చిన్నారులు చేరినట్టు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి హైపో గ్లైసిమియా ఉన్నట్టు పరీక్షలో తెలిసింది. రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మరోవైపు బీహార్‌ రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇప్పటికే 40 మందికిపైగా వడదెబ్బతో మరణించినట్లు అధికారులు తెలిపారు.