క్వారంటైన్ నుంచి పరారైన వ్యక్తి.. వెంటాడిన ఆరోగ్యశాఖ సిబ్బంది..

| Edited By:

Jul 07, 2020 | 3:37 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకునేందుకు

క్వారంటైన్ నుంచి పరారైన వ్యక్తి.. వెంటాడిన ఆరోగ్యశాఖ సిబ్బంది..
Follow us on

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్యశాఖ సిబ్బంది నానాతంటాలు పడ్డారు. ఈ ఘటన కేరళలోని పాథనంతిట్ట ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లో కెళితే.. స్థానికంగా ఓ వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉండాల్సింది. అయితే అతను ఈ నిబంధనలు పాటించలేదు. ఇష్టానుసారం ప్రయాణాలు చేయసాగాడు. ఈ క్రమంలో దాదాపు 10కిమీలు ప్రయాణించి చెన్నీర్‌కరా చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన అధికారులు పీపీఈ కిట్లు ధరించి అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. స్ట్రెచర్‌కు బలవంతంగా కట్టేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలయింది.

Also Read: కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..