అప్పు తీర్చటంలేదని గుండుకొట్టించారు

|

Oct 05, 2020 | 8:40 AM

బాకీ తీర్చటం లేదని ఒక వ్యక్తికి గుండు కొట్టించిన ఘటన పశ్చిమ గోదావరిజిల్లాలో నెలకొంది. తీసుకున్న అప్పు చెల్లించకపోవటంతో జంగారెడ్డిగూడెంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆఫీసులో ఎర్రసాని విజయబాబు అనే వ్యక్తి పనిచేస్తుండగా, తాడేపల్లిగూడెంకు చెందిన అలకా అభిలాష్ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడుగా వర్క్ చేస్తున్నాడు. ఇంటి అవసరాల నిమిత్తమని విజయబాబు దగ్గర అభిలాష్ 28 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఎన్నిసార్లు అడిగినా తీసుకున్న అప్పు తీర్చకపోవటంతో తాడేపల్లిగూడెం […]

అప్పు తీర్చటంలేదని గుండుకొట్టించారు
Follow us on

బాకీ తీర్చటం లేదని ఒక వ్యక్తికి గుండు కొట్టించిన ఘటన పశ్చిమ గోదావరిజిల్లాలో నెలకొంది. తీసుకున్న అప్పు చెల్లించకపోవటంతో జంగారెడ్డిగూడెంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఆఫీసులో ఎర్రసాని విజయబాబు అనే వ్యక్తి పనిచేస్తుండగా, తాడేపల్లిగూడెంకు చెందిన అలకా అభిలాష్ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడుగా వర్క్ చేస్తున్నాడు. ఇంటి అవసరాల నిమిత్తమని విజయబాబు దగ్గర అభిలాష్ 28 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఎన్నిసార్లు అడిగినా తీసుకున్న అప్పు తీర్చకపోవటంతో తాడేపల్లిగూడెం నుంచి అభిలాష్ ను కారులో రప్పించిన విజయబాబు గుండుకొట్టించి వదిలిపెట్టాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించటంతో విజయబాబు, షేక్ నాగూర్ మీరావలి, కంకిరెడ్డి మార్కండేయులు, మోటూరి మణికంఠను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.