Latest Crime News: ప్రేమను తిరస్కరించిందని కాల్ గర్ల్‌గా మార్చేశాడు.. ఏకంగా స్నేహితురాలి ఫొటోలనే..

|

Jan 02, 2021 | 8:44 AM

Latest Crime News: తన ప్రేమను తిరస్కరించిందని ఏకంగా స్నేహితురాలి ఫొటోలను అసభ్యకరంగా మార్చేసి డేటింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేశాడు

Latest Crime News: ప్రేమను తిరస్కరించిందని కాల్ గర్ల్‌గా మార్చేశాడు.. ఏకంగా  స్నేహితురాలి ఫొటోలనే..
Follow us on

తన ప్రేమను తిరస్కరించిందని ఏకంగా స్నేహితురాలి ఫొటోలను అసభ్యకరంగా మార్చేసి డేటింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేశాడు ఓ దుర్మార్గుడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు ఫోన్‌కాల్స్ రావడంతో విసుగెత్తిపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో అసలు వివరాలు వెలుగులోకి వచ్చాయి.

కింగ్‌కోఠికి చెందిన మహ్మద్‌ సమీర్‌, బాధితురాలు మూడు నెలల కిందట కళాశాలలో ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్నాళ్లు ఆమెతో బాగానే ఉన్నాడు. అనంతరం ప్రేమిస్తున్నానని వేధించడం మొదలెట్టాడు. ఆ యువతి తిరస్కరించడంతో కోపాన్ని పెంచుకున్నాడు. తనను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. దీంతో ఆమె ఫొటోలు కలెక్ట్ చేసి వాటిని అసభ్యకరంగా మార్చి ఓ డేటింగ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి కాల్ గర్ల్‌గా ప్రచారం చేశాడు. ఆ చిత్రాల కింద బాధితురాలి ఫోన్‌ నంబరు, వివరాలు ఇచ్చాడు. దీంతో తెలియని నెంబర్ల ద్వారా వచ్చే ఫోన్‌కాల్స్‌తో ఆ యువతి చాలా ఇబ్బంది పడింది. భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సమీర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.