HCL Acquisition Of DWS: ఆస్ట్రేలియా కంపెనీని కొనుగోలు చేసిన భారత్‌ టెక్‌ దిగ్గజం.. ఈ డీల్‌ విలువ ఎంతంటే..

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 1:09 PM

HCL Acquisition Of Australia Company: భారత ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ సేవల దిగ్గజ సంస్థ డీడబ్ల్యూఎస్‌ను..

HCL Acquisition Of DWS: ఆస్ట్రేలియా కంపెనీని కొనుగోలు చేసిన భారత్‌ టెక్‌ దిగ్గజం.. ఈ డీల్‌ విలువ ఎంతంటే..
Follow us on

HCL Acquisition Of Australia Company: భారత ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ భారీ డీల్‌ కుదుర్చుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ సేవల దిగ్గజ సంస్థ డీడబ్ల్యూఎస్‌ను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఐటీ సేవలు అందించే ఈ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌సీఎల్‌ గత సెప్టెంబర్‌లో ప్రకటించింది.
తాజాగా ఈ డీల్‌ పూర్తయినట్లు, డీడబ్ల్యూఎస్‌ పూర్తిస్థాయి కార్యకలాపాలు హెచ్‌సీఎల్‌ చేతికి వచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ కొనుగోలు విలువ సుమారు 158.2 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు, మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.850 కోట్లకు పైమాటే. దీంతో డీడబ్ల్యూఎస్‌ కంపెనీలోని మొత్తం 131.83 మిలియన్‌ షేర్లు హెచ్‌సీఎల్‌ సొంతం చేసుకుంది. డీడబ్ల్యూఎస్‌లోని షేర్‌ హోల్డర్లకు ఒక్కో షేరుకు 0.03 ఆస్ట్రేలియన్‌ డాలర్ల డివిడెండ్లు చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్‌ ప్రకటించింది. ఇక మెల్‌బోర్నో, సిడ్నీ, ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌, కాన్‌బెర్రాలో సంస్థ కార్యాలయానున్న డీడబ్ల్యూఎస్‌ కంపెనీలో ప్రస్తుతం 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే కేవలం భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఐటీ సేవలు అందిస్తోన్న హెచ్‌సీఎల్‌కు కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్‌బోర్న్‌, వంటి ప్రముఖ నగరాల్లో సుమారు 1600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Also Read:

Lucky Draw: యూఏఈలో జాక్‌పాట్ కొట్టేసిన ప్రవాస భారతీయుడు.. లక్కీ డ్రాలో ఊహించని విధంగా..

Bank Will Responsible For Hacking : మీ ఖాతా నుంచి నగదు మీ ప్రమేయం లేకుండా పోతే… బ్యాంకుదే బాధ్యత…