పాక్ మిలటరీకి సమాచారం.. భారత ఆర్మీ ఉద్యోగి అరెస్ట్

|

Sep 18, 2020 | 11:22 AM

గుఢాచర్యానికి పాల్పడుతున్న ఓ సైనికుడిని నిఘా వర్గాలు గుర్తించాయి. భారతదేశానికి సంబంధించిన సైనిక సమాచారాన్ని పాకిస్థాన్ మిలటరీ ఇంటలిజెన్స్ కు చేరవేస్తున్న మిలటరీ ఉద్యోగిని హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

పాక్ మిలటరీకి సమాచారం.. భారత ఆర్మీ ఉద్యోగి అరెస్ట్
Follow us on

గుఢాచర్యానికి పాల్పడుతున్న ఓ సైనికుడిని నిఘా వర్గాలు గుర్తించాయి. భారతదేశానికి సంబంధించిన సైనిక సమాచారాన్ని పాకిస్థాన్ మిలటరీ ఇంటలిజెన్స్ కు చేరవేస్తున్న మిలటరీ ఉద్యోగిని హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా రాష్ట్రంలోని రేవారి జిల్లాకు చెందిన యువకుడు జైపూర్ నగరంలోని మిలటరీ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ కు చెందిన మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులకు మన దేశానికి సంబంధించి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నాడు. అతనిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టిన హర్యానా టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా గురుగ్రామ్ నగరంలోని దారుహెరా బస్‌స్టాండులో గురువారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ ఉద్యోగి వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ మిలటరీకి పంపించాడని అధికారులు తెలిపారు. నిందితుడిపై దారుహేరా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడి నుంచి ఎస్టీఎఫ్ పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.