హిందూ మతం పుచ్చుకున్న 250 మంది ముస్లింలు.!

|

May 11, 2020 | 11:10 AM

హర్యానాలోని హిసార్ జిల్లా బిద్మిరా గ్రామంలో పెద్ద ఎత్తున మతమార్పిడిలు జరిగాయి. ఆ గ్రామంలోని 40 కుటుంబాలకు చెందిన 250 మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు. గ్రామంలోని అనేక మంది ప్రజలు హిందూ జీవన విధాన శైలిను అనుసరిస్తారని.. అయితే మరణించినవారి చివరి కర్మల సమయంలో మాత్రం చనిపోయినవారిని సమాధి చేసే ఇస్లామిక్ ఆచారాన్ని అనుసరిస్తారని తెలుస్తోంది. ఈ కుటుంబాలు అన్నీ కూడా స్వాతంత్య్రానికి ముందు దనోడా కలాన్ గ్రామంలో నివసించేవారట. (డేంజర్ బెల్స్: మరో […]

హిందూ మతం పుచ్చుకున్న 250 మంది ముస్లింలు.!
Follow us on

హర్యానాలోని హిసార్ జిల్లా బిద్మిరా గ్రామంలో పెద్ద ఎత్తున మతమార్పిడిలు జరిగాయి. ఆ గ్రామంలోని 40 కుటుంబాలకు చెందిన 250 మంది ముస్లింలు హిందూ మతంలోకి మారారు. గ్రామంలోని అనేక మంది ప్రజలు హిందూ జీవన విధాన శైలిను అనుసరిస్తారని.. అయితే మరణించినవారి చివరి కర్మల సమయంలో మాత్రం చనిపోయినవారిని సమాధి చేసే ఇస్లామిక్ ఆచారాన్ని అనుసరిస్తారని తెలుస్తోంది. ఈ కుటుంబాలు అన్నీ కూడా స్వాతంత్య్రానికి ముందు దనోడా కలాన్ గ్రామంలో నివసించేవారట. (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

ఇటీవల మరణించిన తన 80 ఏళ్ల తల్లి ఫూలీ దేవిని ఖననం చేసే క్రమంలో తాను హిందూ మతంలోకి మారడం సంతోషాన్ని కలిగించిందంటూ స్థానిక నివాసి సత్బీర్ తెలిపాడు. తామంతా కూడా ఔరంగజేబు కాలంలో బలవంతంగా మతమార్పిళ్లకు గురయ్యామని చెప్పుకొచ్చాడు. గతంలో తామంతా హిందువులమేనని.. ఈ విషయం తెలుసుకుని తమ ఇష్టపూర్వకంగానే ఇప్పుడు మతం మార్చుకున్నామని పేర్కొన్నాడు. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

ఇక ఇదే విషయంపై మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘మేము చనిపోయినవారిని పాతిపెట్టినప్పుడు మిగతా వారందరూ కూడా మమ్మల్ని భిన్నంగా చూసేవారు. అందుకే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మతం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం. విద్య కారణంగా ప్రజలు తమ గతం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నారని అతడు వివరించాడు. కాగా, గత ఏడాది నవంబర్‌లో, ఒక హిందూ సాంస్కృతిక సంస్థ 25 వేల మంది ముస్లింలను, క్రైస్తవులను తిరిగి హిందూ మతంలోకి మార్చగలిగిందని ఒక విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) నాయకుడు తెలియజేశారు.

Read This: నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!