ASIA బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్న అనంతపురం బుడ్డోడు

| Edited By:

Feb 28, 2020 | 2:29 PM

కరెంట్‌ తీగ చూట్టానికి సన్నగానే ఉంటుంది. కానీ టచ్‌ చేస్తే వచ్చేది షాకే! ఇప్పుడీ డైలాగ్‌ ఎందుకంటే... అనంతపురానికి చెందిన హర్ష అనే బుడతడు కూడా చూట్టానికి..

ASIA బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్న అనంతపురం బుడ్డోడు
Follow us on

కరెంట్‌ తీగ చూడ్డానికి సన్నగానే ఉంటుంది. కానీ టచ్‌ చేస్తే వచ్చేది షాకే! ఇప్పుడీ డైలాగ్‌ ఎందుకంటే… అనంతపురానికి చెందిన హర్ష అనే బుడతడు కూడా చూడ్డానికి చిన్నగానే ఉంటాడు. కానీ అతడు చేస్తే విన్యాసాలు చూస్తే షాకవ్వాల్సిందే! మంటల కింద నుంచి లింబో స్కేటింగ్‌ చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించాడు హర్షవర్దన్‌. అతి సాహసోపేతమైన ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో ఎఎస్‌ఐఎ రికార్డు నెలకొల్పాడు.. భగభగమండే మంటల కింద నుంచి అవలీలగా ఈ ఫీట్‌ చేశాడు.

అనంతపురం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల సమక్షంలో ఏడున్నర అంగుళాల ఎత్తులో మంటలు వస్తుండగా వాటి కింద స్కేటింగ్‌ చేస్తూ రికార్డు నెలకొల్పాడు. అనంతపురంలో నాలుగో తరగతి చదువుతున్నాడు హర్షవర్దన్‌ ఆచారి.. బెంగళూరు, గోవా, చెన్నై, తిరుపతిలాంటి పలు ప్రాంతాలలో జరిగిన జాతీయ పోటీలలో నంబర్‌వన్‌గా నిలిచి 15 బంగారుపతకాలను సాధించాడు. ప్రతిష్టాత్మక ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డును కూడా నెలకొల్పాడు. అంతే కాకుండా ఫైర్‌ లింబోలో కూడా కఠోర శిక్షణ తీసుకున్నాడు.

హర్షవర్దన్‌ టాలెంట్‌ను తెలుసుకున్న ప్రపంచ రికార్డు ప్రతినిధులు అనంతపురంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో అతి సాహసోపేతమైన ఫీట్‌ను చేశాడీ బుడతడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం డీఐజీ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇతర ప్రముఖులు వచ్చారు. వీరంతా హర్షవర్ధన్‌ ఫీట్‌ చూసి ఆశ్చర్యపోయారు.