విద్యార్థులకు వెరైటీ మెసేజ్.. హరీశ్ ఏంచేశారంటే?

| Edited By: Pardhasaradhi Peri

Dec 03, 2019 | 8:51 PM

టిఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ తన నియోజకవర్గం విషయంలో ఎంత క్లారిటీతో వుంటారో.. సిద్దిపేటలో ఎవరిని అడిగినా చెబుతారు. నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలన్న హరీశ్ సంకల్పం ఒక్క కోమటిచెరువును చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి హరీశ్ తాజాగా ఓ వెరైటీ మెసేజ్‌తో తనదైన శైలిని మరోసారి ప్రదర్శించారు. ఇంతకీ ఏంటా మెసేజ్? ఎవరికా మెసేజ్? తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సిద్దిపేటను అభివృద్ది చేయడంలో హరీశ్ తనవంతు పాత్ర దాదాపు 15 ఏళ్ళ నుంచి పోషిస్తున్నారు. అందుకే […]

విద్యార్థులకు వెరైటీ మెసేజ్.. హరీశ్ ఏంచేశారంటే?
Follow us on

టిఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ తన నియోజకవర్గం విషయంలో ఎంత క్లారిటీతో వుంటారో.. సిద్దిపేటలో ఎవరిని అడిగినా చెబుతారు. నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలన్న హరీశ్ సంకల్పం ఒక్క కోమటిచెరువును చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి హరీశ్ తాజాగా ఓ వెరైటీ మెసేజ్‌తో తనదైన శైలిని మరోసారి ప్రదర్శించారు. ఇంతకీ ఏంటా మెసేజ్? ఎవరికా మెసేజ్?

తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సిద్దిపేటను అభివృద్ది చేయడంలో హరీశ్ తనవంతు పాత్ర దాదాపు 15 ఏళ్ళ నుంచి పోషిస్తున్నారు. అందుకే సిద్దిపేట గల్లీ నుంచి హైదరాబాద్ అసెంబ్లీ దాకా హరీశ్ స్టైల్ చర్చనీయాంశమైంది. తాజాగా కోమటిచెరువుపై రాష్ట్రంలోనే అతిపెద్ద రోప్ బ్రిడ్జి ఏర్పాటు చేసి అందరి దృష్టి సిద్దిపేట వైపు మళ్ళేలా చేశారాయన.

ఇదే ఊపులో విద్యార్థులకు చక్కని మెసేజ్ పంపారు హరీశ్ రావు. ఒకరికో.. ఇద్దరికో కాదు.. ఏకంగా 14 వేల మంది పదో తరగతి విద్యార్థులకు మెసేజ్ పంపారు. పదో తరగతి ఎంత కీలకమైందో వివరిస్తూ.. మోటివేషన్ మెసేజ్ ఫార్వార్డ్ చేశారు మంత్రి. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, సిద్దిపేట పేరు రాష్ట్రమంతటా మారుమోగాలని, అందుకు తగిన ప్రోత్సహకాలు తాను ఇస్తానని చెబుతూ హరీశ్ పంపిన మెసేజ్.. ఇప్పుడు సిద్దిపేట జిల్లా పాఠశాలల్లో చర్చనీయాంశమైంది.

విద్యారంగంలో సిద్దిపేట ముందుండాలన్న సంకల్పంతో హరీశ్ సంధించిన ఈ సందేశాలు విద్యార్థులను బాగానే మోటివేట్ చేస్తున్నాయని జిల్లాలో ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.