కాళేశ్వరం సంబురాల్లో హరీష్ రావు..!

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ సస్యశామలం అవుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ధిపేటలోని కార్యకర్తలతో కలసి సంబరాల్లో పాల్గొన్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణకు జలహారంలా కాళేశ్వరం నిలవబోతుందన్న ఆయన ఇక నీటి సమస్యలుండవని తెలిపారు. 70 ఏళ్లలో ఎన్నో పార్టీలు పాలించినా ప్రాజెక్టులు కట్టలేదన్నారు. ప్రాజెక్టు కోసం ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు కావాల్సిన భూములను ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే.. కాళేశ్వరానికి […]

కాళేశ్వరం సంబురాల్లో హరీష్ రావు..!

Updated on: Jun 21, 2019 | 4:51 PM

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ సస్యశామలం అవుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ధిపేటలోని కార్యకర్తలతో కలసి సంబరాల్లో పాల్గొన్నారు. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణకు జలహారంలా కాళేశ్వరం నిలవబోతుందన్న ఆయన ఇక నీటి సమస్యలుండవని తెలిపారు. 70 ఏళ్లలో ఎన్నో పార్టీలు పాలించినా ప్రాజెక్టులు కట్టలేదన్నారు. ప్రాజెక్టు కోసం ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు కావాల్సిన భూములను ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే.. కాళేశ్వరానికి తన వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉందని హరీష్ రావు వ్యాఖ్యనించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us