ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా!

|

Oct 20, 2020 | 5:37 PM

2021 ఫిబ్రవరి నాటికి దేశ జనాభాలో కనీసం సగం మందికి కోవిడ్ సోకే అవకాశం ఉందని, దాని వ్యాప్తి నెమ్మదించడానికి అది దోహద పడుతుందని ఐఐటీ- కాన్పుర్‌కు చెందిన ఆచార్య మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు.

ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా!
Follow us on

2021 ఫిబ్రవరి నాటికి దేశ జనాభాలో కనీసం సగం మందికి కోవిడ్ సోకే అవకాశం ఉందని, దాని వ్యాప్తి నెమ్మదించడానికి అది దోహద పడుతుందని ఐఐటీ- కాన్పుర్‌కు చెందిన ఆచార్య మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఆయనొక మెంబర్‌గా ఉన్నారు. ‘గణిత నమూనాల ప్రకారం దేశంలో 30% మంది జనాభా ఇప్పటికే కోవిడ్ సోకింది. ఇది ఫిబ్రవరి నాటికి 50 శాతానికి చేరుతుంది. గవర్నమెంట్ నిర్వహించిన సీరలాజికల్‌ సర్వేలో 14% జనాభాకే  కరోనా సోకినట్లు గణాంకాలు నమోదయ్యాయి. అయితే ఆ సర్వేకు తీసుకున్న శాంపిల్  పరిణామాలను బట్టి చూస్తే అవి కరెక్ట్ కాకపోవచ్చు. దీని బదులుగా మేం గణిత నమూనాను ఎంచుకున్నాం. లెక్కల్లో చేరిన కేసులనే కాకుండా లెక్కల్లోకి రానివాటినీ పరిగణనలో తీసుకున్నాం. ప్రజలు వైరస్‌ను లైట్ తీసుకుని మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయకపోతే మా అంచనాలు ఇంకా మారిపోతాయి. ఒక్క నెలలోనే 26 లక్షల కొత్త కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అని అగర్వాల్‌ సోమవారం పేర్కొన్నారు.

Also Read :

Hyderabad Floods : ఎన్ని కష్టాలు వచ్చాయ్ బ్రదర్ !

Bigg Boss Telugu 4 : అరియానాకు పెరుగుతోన్న ఫాలోయింగ్ !