GHMC Elections: సంక్షేమ సంఘాల మద్దతు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే పునాదిగా జీహెచ్ఎంసీ బరిలోకి పూజిత గౌడ్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నేడు  జరగనున్నాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చట్ట ప్రకారం ఈసారి హైదరాబాద్‌ మేయర్‌ స్థానం మహిళది.

GHMC Elections: సంక్షేమ సంఘాల మద్దతు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే పునాదిగా జీహెచ్ఎంసీ బరిలోకి పూజిత గౌడ్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 10:37 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నేడు  జరగనున్నాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చట్ట ప్రకారం ఈసారి హైదరాబాద్‌ మేయర్‌ స్థానం మహిళది. 2020 నుంచి 2025 దాకా.. అయిదేళ్లు మహిళ సిటీకి నాయకత్వం వహిస్తారు. హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ నుంచి టీఆర్ఎస్ తరపున వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ పోటీచేస్తున్నారు. హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా పరిష్కరిస్తూ కార్పొరేట‌ర్ వి.పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ప్రజల మన్నలను పొందారు.

ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ తన భర్త మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ డివిజన్ కు అందించిన సేవలు, సంపాదించుకున్న అభిమానుల సహకారంతో గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు పూజిత జగదీశ్వర్ గౌడ్. ఆతర్వాత భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ డివిజన్  అభివృద్ధి కార్యక్రమాలు సైతం జోరుగా చేపట్టారు. జగదీశ్వర్ గౌడ్ సైతం మాదాపూర్ తో పాటు హఫీజ్ పేట్ డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సతీమణికి వెన్నుదన్నుగా నిలిచాడు. విమర్శలకు తావివ్వకుండా పాలన అందించడంతో డివిజన్ లో అభిమానులను ఎక్కువగానే పొందగలిగారు పూజిత. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ డివిజన్ నుండి 28303 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న డివిజన్ హఫీజ్ పేట్.ఈ డివిజన్ లో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 70479 . టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పూజిత జగదీశ్వర్ గౌడ్ నియోజక వర్గంలోనే అత్యధికంగా 17094 ఓట్లను సాధించి విజయం సాధించారు. రెండవ స్థానంలో 8475 ఓట్లతో షైనాజ్ అక్తర్ నిలువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలింగ్ లక్ష్మి గౌతమ్ గౌడ్ 2137 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల మద్దతు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే గెలుపును సొంతంచేస్తాయని మరోసారి ఎన్నికల క్షేత్రంలో అడుగు పెట్టారు పూజిత జగదీశ్వర్ గౌడ్.

Latest Articles