సైనా పొలిటికల్ ఎంట్రీపై జ్వాల ట్వీట్.. నెటిజన్లు ఫైర్.!

|

Jan 31, 2020 | 1:51 PM

Gutta Jwala Controversial Tweet: ఇటీవల స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నో పతకాలు, ఆపై రికార్డులు సాధించిన సైనా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి చేరడం పార్టీలో కొత్త జోష్‌ను నింపుతుందని నేతలు కూడా భావిస్తున్నారు. అయితే సైనా పొలిటికల్ రీ-ఎంట్రీపై మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా మాత్రం […]

సైనా పొలిటికల్ ఎంట్రీపై జ్వాల ట్వీట్.. నెటిజన్లు ఫైర్.!
Follow us on

Gutta Jwala Controversial Tweet: ఇటీవల స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నో పతకాలు, ఆపై రికార్డులు సాధించిన సైనా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి చేరడం పార్టీలో కొత్త జోష్‌ను నింపుతుందని నేతలు కూడా భావిస్తున్నారు.

అయితే సైనా పొలిటికల్ రీ-ఎంట్రీపై మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించింది. సైనాను కించపరిచే విధంగా ట్వీట్ చేసింది. ‘ఇప్పటివరకు అర్ధం పర్ధంలేని ఆటలే ఆడావ్ అని అనుకున్నా.. కానీ ఇప్పుడు అర్ధంపర్ధం లేని పార్టీలో కూడా జాయిన్ అయ్యావని’ గుత్తా జ్వాల ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే నెటిజన్లు మాత్రం గుత్తా ట్వీట్‌కు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ‘ అర్థం లేని పెళ్లిళ్లు మాత్రం చేసుకోలేదులే’ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇవ్వగా.. ‘నీకు నచ్చిన పార్టీలో నువ్వు కూడా చేరొచ్చు.. ఎవరు ఆపారు’ అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు.