మలేషియా జైల్లో మగ్గుతున్న గుంటూరు యువకుడు.. ఉపాధి కోసం వెళ్లి నరకం..

| Edited By:

Jul 29, 2019 | 1:42 PM

ఉపాధి కోసం మలేషియా వెళ్లి గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఏజెంట్ మాటలు నమ్మి విమానం ఎక్కిన అతడిని అక్కడి పోలీసులు జైల్లో పెట్టారు. పదవ తరగతి పూర్తి చేసిన నరసింహారావు తండ్రికి ఆసరాగా నిలిచేందుకు ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. ఆ దేశానికి వెళ్లేందుకు లక్ష రూపాయలు అప్పుచేశాడు. అయితే ఐదు నెలల క్రితం టూరిస్ట్ వీసాతో అక్కడికి వెళ్లిన నరసింహారావు రెండు నెలల పాటు ఓ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్‌లో పనిచేశాడు. […]

మలేషియా జైల్లో మగ్గుతున్న గుంటూరు యువకుడు.. ఉపాధి కోసం వెళ్లి నరకం..
Follow us on

ఉపాధి కోసం మలేషియా వెళ్లి గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఏజెంట్ మాటలు నమ్మి విమానం ఎక్కిన అతడిని అక్కడి పోలీసులు జైల్లో పెట్టారు. పదవ తరగతి పూర్తి చేసిన నరసింహారావు తండ్రికి ఆసరాగా నిలిచేందుకు ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. ఆ దేశానికి వెళ్లేందుకు లక్ష రూపాయలు అప్పుచేశాడు. అయితే ఐదు నెలల క్రితం టూరిస్ట్ వీసాతో అక్కడికి వెళ్లిన నరసింహారావు రెండు నెలల పాటు ఓ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్‌లో పనిచేశాడు. ఆ తర్వాత అతడిది టూరిస్ట్ వీసా అని తెలుసుకున్న పోలీసులు, అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చదువుకునే రోజుల్లో నరసింహారావుకు, సైదారావుతో స్నేహం ఏర్పడింది. వీరిద్దరినీ మలేషియా పంపిస్తానని భీమవరానికి చెందిన ఓ మధ్యవర్తి నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి మలేషియా వెళ్లిన నరసింహారావు జైల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో తన తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాడు. దీంతో తమ కుమారుడిని భారత్ కు పంపించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.