ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల దూకుడు

|

May 02, 2019 | 5:39 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్‌లో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల పన్నులు వసూలు చేయడం విశేషం. 2019 మార్చిలో రూ.1,05,577 పన్నులు వసూలు చేయడం మరో రికార్డ్. ఒక్క నెలలోనే ఏకంగా 15.6 శాతం వసూళ్లు పెరిగాయి. జీఎస్టీ లక్ష కోట్ల మార్క్ దాటడం ఇదే కొత్త కాదు. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఏప్రిల్ వరకు జీఎస్టీ వసూళ్లు ఐదుసార్లు […]

ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల దూకుడు
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్‌లో ఏకంగా రూ.1.13 లక్షల కోట్ల పన్నులు వసూలు చేయడం విశేషం. 2019 మార్చిలో రూ.1,05,577 పన్నులు వసూలు చేయడం మరో రికార్డ్. ఒక్క నెలలోనే ఏకంగా 15.6 శాతం వసూళ్లు పెరిగాయి. జీఎస్టీ లక్ష కోట్ల మార్క్ దాటడం ఇదే కొత్త కాదు. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఏప్రిల్ వరకు జీఎస్టీ వసూళ్లు ఐదుసార్లు లక్ష కోట్లకు పైనే ఉండటం విశేషం.

భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సరికొత్త పరోక్ష పన్నుల విధానం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2017 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా జీఎస్టీ వసూలు చేసింది 2019 ఏప్రిల్‌లోనే. తాజా లెక్కలు చూస్తే పన్నుల వసూళ్లలో ఏటా 10.5 శాతం పెరుగుదల కనిపిస్తోందని అంచనా. గతేడాది ఆగస్ట్ నుంచే జీఎస్టీ వసూళ్లు నెలనెలా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో రూ.97 వేల కోట్లు వసూలు చేయగా, మార్చిలో రూ.1.06 లక్షల కోట్ల పన్నులు వచ్చాయి. ఏప్రిల్‌లో పన్నుల వసూళ్లు మరింత పెరిగాయి.