వైర‌ల్ వీడియో: వ‌రుస‌గా రోడ్డు దాటుతున్న మొస‌ళ్లు.. ఆశ్చ‌ర్య‌పోయిన జ‌నం..

| Edited By:

Jul 26, 2020 | 5:09 PM

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి రాక‌తో.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మనుషులంద‌రూ లాక్‌డౌన్ అవ‌డంతో వన్య ప్రాణులు స్వేచ్ఛ‌గా రోడ్ల‌పై తిరుగాడిన సంద‌ర్భాలు మ‌నం చూశాము. ఇప్పుడు మ‌నుషులు అన్‌లాక్ అవుతున్నా.. అవి త‌మ అల‌వాటును పోగొట్టుకోలేక‌పోతున్నాయి. జ‌నావాసాల్లోకి వ‌చ్చి...

వైర‌ల్ వీడియో: వ‌రుస‌గా రోడ్డు దాటుతున్న మొస‌ళ్లు.. ఆశ్చ‌ర్య‌పోయిన జ‌నం..
Follow us on

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి రాక‌తో.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మనుషులంద‌రూ లాక్‌డౌన్ అవ‌డంతో వన్య ప్రాణులు స్వేచ్ఛ‌గా రోడ్ల‌పై తిరుగాడిన సంద‌ర్భాలు మ‌నం చూశాము. ఇప్పుడు మ‌నుషులు అన్‌లాక్ అవుతున్నా.. అవి త‌మ అల‌వాటును పోగొట్టుకోలేక‌పోతున్నాయి. జ‌నావాసాల్లోకి వ‌చ్చి భ‌య‌పెడుతున్నాయి. తాజాగా అమెరికాలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. అస‌లే ఎప్పుడూ బ‌ద్ధ‌కంతో ఉండే మొస‌ళ్లు.. మీట‌రు దూర‌మున్న రోడ్డును దాటాయి. అది కూడా ఎంతో కూల్‌గా.. నెమ్మ‌దిగా రోడ్డు క్రాస్ చేశాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఫుల్లుగా వైర‌ల్ అవుతున్నాయి.

అమెరికాలోని ఓ వంతెన కింద‌ న‌ది ఉంది. వంతెన అటువైపు ఉన్న మొస‌ళ్ల‌కు అక్క‌డ బోర్ కొట్టిందో.. ఏమో.. వంతెన ఇటువైపు ఉన్న నీటిలోకి వెళ్లాల‌నుకున్నాయి. అందుకోసం అవి వంతెన కింద న‌దిలో ఈదుతూ వెళ్లొచ్చు. అవి అలా చేయ‌కుండా.. వంతెన‌పైకి వ‌చ్చి రోడ్డుపైకి వ‌చ్చి వాహ‌న‌దారుల‌కు బ్రేక్ ఇచ్చి నెమ్మ‌దిగా రోడ్డు దాటాయి. ఎప్పుడూ లేనిది ఈ మూడు మొస‌ళ్లు అలా రోడ్డు దాటుతుంటే.. వాటిని వీడియోలు తీస్తూ.. అక్క‌డున్న ప్ర‌యాణికులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

 

Read More: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ మెగాస్టార్‌, ప‌వ‌ర్ స్టార్‌