ఐటీ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. డిసెంబర్‌ 31 వరకు..

| Edited By:

Jul 22, 2020 | 6:00 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు

ఐటీ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. డిసెంబర్‌ 31 వరకు..
Follow us on

ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత గడువు జూలై 31 తో ముగుస్తోంది. “కరోనా కారణంగా కొనసాగుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఇంటి నుండి పనిని సులభతరం చేయడానికి 2020 డిసెంబర్ 31 వరకు ఇతర సేవా సంస్థలకు నిబంధనలు, షరతులలో సడలింపులను DoT విస్తరించింది” అని టెలికమ్యూనికేషన్ విభాగం అర్థరాత్రి ట్వీట్‌లో తెలిపింది. ప్రస్తుతం, ఐటీ ఉద్యోగుల్లో 85 శాతం మంది ఇంటి నుండే పనిచేస్తున్నారు. క్లిష్టమైన విధులు నిర్వహిస్తున్న వారు మాత్రమే కార్యాలయాలకు వెళుతున్నారు. భారత్ లో కరోనావైరస్ కేసులు దాదాపు 12 లక్షల వరకు నమోదయ్యాయి. దాదాపు 28, 732 మంది ప్రాణాలు కోల్పోయారు.

[svt-event date=”22/07/2020,5:56PM” class=”svt-cd-green” ]