హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు మూసివేత‌..వాటికి మాత్ర‌మే అనుమ‌తి..!

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమ‌లవుతుండ‌టంతో హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును మూసేయాలని స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. రద్దీ లేక‌పోవ‌డంతో రోడ్డుపై వాహనదారులు అతివేగంగా వెహిక‌ల్స్ న‌డుపుతూ ప్రమాదాలకు కార‌కుల‌వుతున్నారు. దీంతో హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును పాక్షికంగా మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర వస్తువులను తరలించే ట్ర‌క్కుల‌, లారీలు లాంటి భారీ వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. లైట్ మోట‌ర్ వాహ‌నాల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిషేధించారు. గోల్కండ ఓఆర్‌ఆర్‌ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలుస‌ కూలీలు మృతిచెందారు. […]

హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు మూసివేత‌..వాటికి మాత్ర‌మే అనుమ‌తి..!
ORR Villages

Edited By:

Updated on: Mar 28, 2020 | 5:00 PM

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అమ‌లవుతుండ‌టంతో హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును మూసేయాలని స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. రద్దీ లేక‌పోవ‌డంతో రోడ్డుపై వాహనదారులు అతివేగంగా వెహిక‌ల్స్ న‌డుపుతూ ప్రమాదాలకు కార‌కుల‌వుతున్నారు. దీంతో హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును పాక్షికంగా మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసర వస్తువులను తరలించే ట్ర‌క్కుల‌, లారీలు లాంటి భారీ వాహనాలకు మాత్రమే అనుమతినిచ్చారు. లైట్ మోట‌ర్ వాహ‌నాల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిషేధించారు.

గోల్కండ ఓఆర్‌ఆర్‌ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలుస‌ కూలీలు మృతిచెందారు. దీంతో అధికారులు మూసివేత దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో పాటు ఔటర్ రింగ్‌పై నిఘాను మరింతగా పెంచాలని వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తున్నారు. సీసీ కెమెరాల సంఖ్య‌, పెట్రోలింగ్ పోలీసుల‌ను కూడా పెంచ‌డానికి మార్గ‌నిర్దేశ‌కాలు సిద్దం చేస్తున్నారు.

Follow Us