సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వర్‌రావు బదిలీ

| Edited By:

Jul 06, 2019 | 7:25 AM

సీబీఐ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నెం నాగేశ్వర్ రావు బదిలీ అయ్యారు. అగ్నిమాపక శాఖ, సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ విభాగానికి ఆయన డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1986 ఒడిశా కేడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాల వివాదం సమయంలో […]

సీబీఐ అదనపు డైరెక్టర్ నాగేశ్వర్‌రావు బదిలీ
Follow us on

సీబీఐ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నెం నాగేశ్వర్ రావు బదిలీ అయ్యారు. అగ్నిమాపక శాఖ, సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ విభాగానికి ఆయన డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

1986 ఒడిశా కేడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాల వివాదం సమయంలో నాగేశ్వరరావుకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఎలాంటి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కోర్టు ఆంక్షలు విధించింది.

కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన అధికారులను బదిలీ చేశారు. దీనిపై ఆగ్రహించిన సుప్రీం రోజంతా కోర్టు ఆవరణలోనే కూర్చోవాలని ఆదేశిస్తూ.. దీంతోపాటు లక్ష రూపాయల జరిమానాను విధించింది.