ప్రభుత్వ ఏర్పాటుకు జగన్‌కు ఆహ్వానం…ముహూర్తం ఖరారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుందని అధికారికంగా రాజభవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. అయితే ఇప్పటికే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి […]

ప్రభుత్వ ఏర్పాటుకు జగన్‌కు ఆహ్వానం...ముహూర్తం ఖరారు
Follow us

| Edited By:

Updated on: May 25, 2019 | 9:36 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సవం జరగనుందని అధికారికంగా రాజభవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్‌ను గవర్నర్ ఆహ్వానించారు.

అయితే ఇప్పటికే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. గవర్నర్ కు శాసనసభాపక్ష సమావేశ తీర్మానాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని జగన్‌ కోరారు. గవర్నర్‌తో జగన్ భేటీ అనంతరం ప్రమాణానికి రాజ్‌భవన్ ముహుర్తం ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది. వైఎస్ జగన్‌ వెంట సీనియర్ నేత, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ ఉన్నారు. అనంతరం జగన్ నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.