ప్రైవేటీకరణ కానున్న విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్ట్స్

| Edited By:

Jul 27, 2019 | 7:49 AM

భవిష్యత్తులో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ విజయవంతంగా అయిందని పూర్తయిందని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్, అఖ్‌నవూ, మంగళూరు ఎయిర్‌పోర్టులను బిడ్డర్లకు అప్పగించే ప్రక్రియ మొదలైందని.. మిగిలిన మూడు ఎయిర్‌పోర్ట్‌ల అప్పగింత సాధ్యమైనంత త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ప్రభుత్వ 100 రోజులు ఎజెండాలో మరిన్ని ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక ఢిల్లీ, ముంబై, […]

ప్రైవేటీకరణ కానున్న విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్ట్స్
Follow us on

భవిష్యత్తులో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేటీకరించే అవకాశం ఉందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురు ప్రసాద్ మహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ విజయవంతంగా అయిందని పూర్తయిందని చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్, అఖ్‌నవూ, మంగళూరు ఎయిర్‌పోర్టులను బిడ్డర్లకు అప్పగించే ప్రక్రియ మొదలైందని.. మిగిలిన మూడు ఎయిర్‌పోర్ట్‌ల అప్పగింత సాధ్యమైనంత త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ప్రభుత్వ 100 రోజులు ఎజెండాలో మరిన్ని ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇక ఢిల్లీ, ముంబై, కోల్​కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లో రెండో విమానాశ్రయం రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులో మినహా మిగిలిన ఏ ఎయిర్‌పోర్టుకు చాలినంత భూమి లేదన్నారు. బెంగళూరులో ప్రస్తుతం రెండో రన్‌వే నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.