ప్రభుత్వ పాఠశాలలకు క్యూ.. సీట్ల కోసం పోటీ..

| Edited By: Ravi Kiran

Jun 13, 2019 | 3:19 PM

ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. సర్కార్ పాఠశాలల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇకప్పుడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలంటే తల్లిదండ్రులు బయపడేవారు కాని ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, విద్యార్థులపై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ లాంటివి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. దీంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు కట్టలేక.. ప్రభుత్వ పాఠశాలల్లో […]

ప్రభుత్వ పాఠశాలలకు క్యూ.. సీట్ల కోసం పోటీ..
Follow us on

ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. సర్కార్ పాఠశాలల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇకప్పుడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలంటే తల్లిదండ్రులు బయపడేవారు కాని ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, విద్యార్థులపై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ లాంటివి విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. దీంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు కట్టలేక.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.