బాబోయ్ ప్రభుత్వ పాఠశాల..

| Edited By: Srinu

Jul 09, 2019 | 12:38 PM

నిజమాబాద్ జిల్లాలోనే అది ఒకే ఒక్క ప్రభుత్వ పాఠశాల. 1968లో ఈ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. 50 యేళ్ల ప్రస్థానం ఉన్న ఈ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 500 మంది విద్యార్థులు ఈ స్కూల్ లో చదువుకుంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ రేకులు విరిగిపడతాయో తెలియదు. ఎంతమంది అధికారులు వచ్చి చూసి వెళ్లినా.. మరమ్మత్తులు మాత్రం చేయించలేదు. పై కప్పులు లేచిపోయి ఎండావానలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. […]

బాబోయ్ ప్రభుత్వ పాఠశాల..
Follow us on

నిజమాబాద్ జిల్లాలోనే అది ఒకే ఒక్క ప్రభుత్వ పాఠశాల. 1968లో ఈ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. 50 యేళ్ల ప్రస్థానం ఉన్న ఈ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 500 మంది విద్యార్థులు ఈ స్కూల్ లో చదువుకుంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ రేకులు విరిగిపడతాయో తెలియదు. ఎంతమంది అధికారులు వచ్చి చూసి వెళ్లినా.. మరమ్మత్తులు మాత్రం చేయించలేదు. పై కప్పులు లేచిపోయి ఎండావానలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం క్లాస్ రూమ్‌లో కూర్చోవడానికి కూడా లేని పరిస్థితి. ఇదిలా వుంటే మరోవైపు కోతుల బెడద ఎక్కువైంది. ఎప్పుడు ఎక్కడవచ్చి మీద పడతాయో తెలియదు. పాఠాలు చెప్పడానికి టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బడికి వెళ్లాలంటేనే విద్యార్థులు హడలిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.