ఆ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్… 4 నెలల అద్దె మినహాయింపు

| Edited By: Anil kumar poka

Apr 17, 2020 | 2:19 PM

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​తో నష్టపోతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణయం తీసుకుంది. ఎస్​టీపీటీ(సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ పార్స్క్​ ఆఫ్​ ఇండియా) పరిధిలో ఉన్న ఐటీ సంస్థలకు 4 నెలల పాటు( 2020 మార్చి 1 నుంచి జూన్​ 30 వరకు) అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం అనౌన్స్ చేసింది. టెక్ పార్కుల్లో ఎక్కువ‌గా చిన్న, […]

ఆ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్... 4 నెలల అద్దె  మినహాయింపు
Follow us on

కరోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​తో నష్టపోతున్న చిన్న సంస్థలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణయం తీసుకుంది. ఎస్​టీపీటీ(సాఫ్ట్​వేర్​ టెక్నాలజీ పార్స్క్​ ఆఫ్​ ఇండియా) పరిధిలో ఉన్న ఐటీ సంస్థలకు 4 నెలల పాటు( 2020 మార్చి 1 నుంచి జూన్​ 30 వరకు) అద్దె నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం అనౌన్స్ చేసింది.

టెక్ పార్కుల్లో ఎక్కువ‌గా చిన్న, మధ్య తరహా సంస్థలే ఉన్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న అద్దె మినహాయింపు నిర్ణయంతో 60 టెక్ పార్కుల్లో ఉన్న‌ 200 వ‌ర‌కు ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు ప్ర‌యోజనం క‌ల‌గ‌నుంది. అంతేకాదు పరోక్షంగా స‌ద‌రు సంస్థల్లో పనిచేసే 3 వేల మందికి లబ్ది చేకూర‌నుంది. ఈ అద్దె మినహాయింపు మొత్తం విలువ రూ.5కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అని ప్రభుత్వ వర్గాల స‌మాచారం.