తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..వారికి పోస్టాఫీసుల ద్వారా రూ.1,500 పంపిణీ

|

Apr 19, 2020 | 12:43 PM

తెలంగాణ ప్రభుత్వం క‌రోనా సాయంగా రేషన్ కార్డు లబ్ధిదారులంద‌రకీ రూ.1,500 అందిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే బ్యాంకు అకౌంట్ లేని ల‌బ్దిదారుల‌కు ఆ న‌గదు మొత్తాన్నీ పోస్టాఫీస్‌ల ద్వారా అందించాలని రాష్ట్ర‌ పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు అకౌంట్స్ లేని 5,21,641 ల‌బ్దిదారుల‌కు రూ.78,24,55,500ను అందించనున్నారు. ఇందుకోసం న‌గ‌దు మొత్తాన్ని పోస్టు మాస్టర్‌ జనరల్, హైదరాబాద్‌ ఖాతాలో పౌర సరఫరాల శాఖ శనివారం జమ చేసింది. రాష్ట్రంలో తెల్ల‌ రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలు మొత్తం […]

తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..వారికి పోస్టాఫీసుల ద్వారా రూ.1,500 పంపిణీ
Follow us on

తెలంగాణ ప్రభుత్వం క‌రోనా సాయంగా రేషన్ కార్డు లబ్ధిదారులంద‌రకీ రూ.1,500 అందిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే బ్యాంకు అకౌంట్ లేని ల‌బ్దిదారుల‌కు ఆ న‌గదు మొత్తాన్నీ పోస్టాఫీస్‌ల ద్వారా అందించాలని రాష్ట్ర‌ పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు అకౌంట్స్ లేని 5,21,641 ల‌బ్దిదారుల‌కు రూ.78,24,55,500ను అందించనున్నారు. ఇందుకోసం న‌గ‌దు మొత్తాన్ని పోస్టు మాస్టర్‌ జనరల్, హైదరాబాద్‌ ఖాతాలో పౌర సరఫరాల శాఖ శనివారం జమ చేసింది. రాష్ట్రంలో తెల్ల‌ రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలు మొత్తం 87.54 లక్షలు ఉండగా, 79.57 లక్షల కుటుంబాలకు ఉచితంగా 12 కిలోల చొప్పున 3.13 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసింది.